‘సర్’ గడువు పొడిగించండి
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:43 AM
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియకు గడువు పొడిగించి, బీఎల్‌వోలపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య..
బీఎల్‌వోలపై ఒత్తిడి తగ్గించాలి
ఈసీకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య వినతి
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియకు గడువు పొడిగించి, బీఎల్‌వోలపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. సోమవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్‌వోలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, పాత సర్ వివరాల ధ్రువీకరణలో సమస్యలు, ఓటర్లు అసంపూర్తిగా ఫారాలు నమోదు చేయడం వంటి కారణాలతో నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తిచేయడం కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియకు గడువు పొడిగించాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్‌ఓలకు ఇతర అధికారిక పనులు అప్పగించకుండా చూడాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.