మరోసారి గడువు కోరిన అమర్నాథ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:38 AM
రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరుకావడానికి మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మరోసారి గడువు కోరారు.
నేడు విచారణకు వస్తానని మహిళా కమిషన్‌కు సమాచారం
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరుకావడానికి మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మరోసారి గడువు కోరారు. గతంలో చెప్పిన మేరకు సోమవారం ఆయన విచారణకు రావల్సివుండగా.. మంగళవారం కమిషన్ ముందు హాజరవుతానని సమాచారం పంపినట్లు తెలిసింది. హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ గతంలో అమర్నాథ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు ఆయన కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే ఒకసారి గడువు కోరారు. తాజాగా మంగళవారం విచారణకు వస్తానంటూ మరోసారి గడువు కోరినట్టు తెలిసింది.