హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ఏరియాలివే..
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:19 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-2 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-2 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు. బర్కత్‌పుర 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, చిక్కడపల్లి,
ఆనంద్‌నగర్ పరిధిలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, జామై ఉస్మానియా పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు, బౌద్ధనగర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు, విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఏడీఈలు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Read Latest AP News And Telangana News And International News And Telugu News