విశాఖలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య..
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:05 AM
విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో తీవ్ర కలకలం రేపింది.
విశాఖపట్నం: జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో తీవ్ర కలకలం రేపింది. మల్లా వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
వినోద్‌కుమార్ ముందుగా తన భార్య, ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆంధ్రా సుగర్స్ చెరకు శుద్ధీకరణ పరికరానికి పేటెంట్
సీఎం, లోకేశ్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు