Share News

సీఎం, లోకేశ్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:32 AM

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోను, టీడీపీ కేంద్ర కార్యాలయంలోను శుక్రవారం రాఖీ పౌర్ణమి సందడి కనిపించింది.

సీఎం, లోకేశ్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

అమరావతి, తాడేపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోను, టీడీపీ కేంద్ర కార్యాలయంలోను శుక్రవారం రాఖీ పౌర్ణమి సందడి కనిపించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత తదితరులు సీఎంకు రాఖీలు కట్టారు. సీఎం వారికి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లోకేశ్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన మంత్రి సవిత రాఖీ కట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 07:05 AM