రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:28 PM
బ్రిడ్జ్ మీద రైల్వే ట్రాక్‌పై ఒంటె చిక్కుకుపోయింది. దీనిని స్థానికులు, జేసీబీ సాయంతో ట్రక్‌పై నుంచి పక్కకు తీసి.. ఒంటె ప్రాణాలు కాపాడారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిడ్జ్ మీద రైల్వే ట్రాక్‌పై ఒంటె చిక్కుకుపోయింది. దీనిని స్థానికులు, జేసీబీ సాయంతో ట్రక్‌పై నుంచి పక్కకు తీసి.. ఒంటె ప్రాణాలు కాపాడారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బావ్ నగర్ రైల్వే డివిజన్‌లోని చోటు చేసుకుంది. వాంజలియా - రాణావవ్ మార్గంలో రైల్వే ట్రాక్‌పై ఒంటె చిక్కుకుపోయినట్లు సౌరాష్ట్ర - పోర్‌బందర్ మధ్య నడిచే సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుర్తించారు. దీంతో ఆ రైలును వెంటనే నిలిపివేశారు.
ఈ విషయాన్ని రైల్వే డివిజన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను పూర్తిగా వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ముంబై, రాజ్‌కోట్ మార్గంలో నడిచే రైళ్లపై ప్రభావం పడింది. ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీతోపాటు స్థానికుల సాయంతో ఒంటెను ట్రాక్‌పై నుంచి సురక్షితంగా పక్కకు తప్పించారు. అనంతరం ఈ మార్గంలో రైళ్లును పునరుద్ధరించారు.
అయితే ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయడంతో ఆ ప్రభావం పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై పడింది. దీంతో పోర్‌బందర్ - సౌరాష్ట్ర, పోర్‌బందర్ - రాజ్ కోట్, పోర్‌బందర్ - బావ్ నగర్ రైళ్లపై పడింది. ఇక వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మూగ జీవి ప్రాణాన్ని రక్షించారంటూ రైల్వే అధికారులను ప్రశంసిస్తున్నారు. సరైన సమయంలో.. సరైన విధంగా సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ స్పందించారని తెలిపారు. ఈ ఒంటిని రక్షించిన క్రెడిట్ ఆయనకే దక్కుతోందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు
For More Prathyekam News And Telugu News