Share News

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:12 PM

భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ఆపద నుంచి అయినా రెప్పపాటులో బయటపడతాం. ఎలాగైనా బతికేస్తాం అనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

ఇంటర్నెట్ డెస్క్: భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ఆపద నుంచి అయినా రెప్పపాటులో బయటపడతాం. ఎలాగైనా బతికేస్తాం అనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు కొద్దిగా ముందుకు వెళ్లగానే.. ఆ పక్కనే ఉన్న భారీ ప్రహారీ గోడ రహదారిపై పడిపోయింది. ఆ శిథిలాలు.. రహదారి అంతా పడిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియాలో చోటు చేసుకుంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రహారీ గోడ బాగా నానిపోయి ఉంది. దాంతో ఆ గోడ కూలిపోయింది.


ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి ఏ మాత్రం నిదానంగా నడిచినా.. అతడిపై ఆ గోడ పడిపోయేదని అంటున్నారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడడం కానీ.. మరణించడం కానీ జరిగేదాని చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాత గోడలు, నిర్మాణాలు మరింత బలహీనమవుతాయని పేర్కొంటున్నారు. అతడు ఎంతైనా అదృష్టవంతుడని నెటిజన్లు అంటున్నారు.


అవి కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన నిర్మాణాలను గుర్తించి.. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. బలహీనమైన నిర్మాణాలను గుర్తించి.. వాటి చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు

For More Prathyekam News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 06:23 PM