Share News

ఆంధ్రా సుగర్స్‌ చెరకు శుద్ధీకరణ పరికరానికి పేటెంట్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:25 AM

పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఆంధ్రా సుగర్స్‌ చెరకు శుద్ధీకరణ పరికరానికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించింది.

ఆంధ్రా సుగర్స్‌ చెరకు శుద్ధీకరణ పరికరానికి పేటెంట్‌

తణుకు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఆంధ్రా సుగర్స్‌ చెరకు శుద్ధీకరణ పరికరానికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించింది. ఆంధ్రా సుగర్స్‌ సంస్థ రూపొందించిన సిరప్‌ శుద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన పరికరానికి 20 ఏళ్ల కాలపరిమితిలో పేటెంట్‌ మంజూరు చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన సిరప్‌ క్లారిఫయర్‌ ద్వారా చెరకును కేవలం తొమ్మిది నిమిషాల్లో శుద్ధీకరిస్తుంది. జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముళ్లపూడి నరేంద్రనాథ్‌ మార్గదర్శకత్వంతో సుగర్‌ ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్ బృందం కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి పరికరాన్ని రుపొందించి, వినియోగంలోకి తీసుకువచ్చింది.

Updated Date - Aug 29 , 2026 | 06:34 AM