ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:06 PM
ఢిల్లీ - బిలాస్‌పూర్ అలయన్స్ విమానానికి శుక్రవారం ప్రమాదం త్రుటిలో తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ పేలింది.
రాయ్‌పూర్, ఆగస్టు 28: ఢిల్లీ - బిలాస్‌పూర్ అలయన్స్ విమానానికి శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ పేలింది. పైలట్ చాకుచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమయంలో విమానంలో 41 మంది ఉన్నారని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు.
వారిలో 37 మంది ప్రయాణికులు కాగా.. నలుగురు సిబ్బంది ఉన్నారని వివరించారు. విమానంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటన కారణంగా బిలాస్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లవలసిన విమాన సర్వీస్‌ను రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
For More National News And Telugu News