సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం.. కాంగ్రెస్ నేతల విమర్శలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:42 PM
సోనియా గాంధీ ఆత్మకథ 'Belonging' కు తాము ప్రచురణకర్త కాదంటూ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చేసిన ప్రకటనపై వివాదం ముదురుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోనియా గాంధీ ఆత్మకథ 'Belonging' కు (బిలాంగింగ్) తాము ప్రచురణకర్త కాదంటూ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చేసిన ప్రకటనపై వివాదం ముదురుతోంది. 'పెంగ్విన్ ఇండియా' వైఖరిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పుస్తకంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన అంశాలపై కోతలు విధించేందుకు పెంగ్విన్ ఇండియా ప్రయత్నించిందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆత్మకథలో ఎడిటోరియల్ మార్పులకు సోనియా గాంధీ నిరాకరించడంతోనే ప్రచురణ విషయంలో తాము వెనకడుగు వేశామన్న వార్తలను ఖండిస్తూ పెంగ్విన్ ఇండియా తాజాగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తాము అసలు పుస్తకానికి పబ్లిషర్ కాదని పేర్కొంది. ఆ పుస్తక ప్రచురణకు ఇప్పటికీ ఉత్సుకతతోనే ఉన్నామని చెప్పింది. రచయిత తమ పుస్తకంలో పేర్కోన్న విషయాలను పరిశీలించి మార్పులు సూచించడం కూడా ప్రచురణకర్తగా తమ విధుల్లో భాగమని చెప్పింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా పేర్కొంది.
పెంగ్విన్ ఇండియా ప్రకటన నేపథ్యంలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను హత్య చేయడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెంగ్విన్ ఇండియా ప్రకటన వీక్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు