హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:02 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్‌మెంట్స్, ఇందూ అపార్ట్‌మెంట్స్, బీఎస్ఎన్‌ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్‌ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు
హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News