Share News

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితా కోమటిరెడ్డి

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:38 AM

అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న తెలుగు సంతతి జాబితాలో మరో మహిళ చేరారు. తెలంగాణ మూలాలు ఉన్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌...

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితా కోమటిరెడ్డి

  • తెలుగు సంతతి వ్యక్తికి ట్రంప్‌ మద్దతు

న్యూఢిల్లీ, ఆగస్టు 19: అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న తెలుగు సంతతి జాబితాలో మరో మహిళ చేరారు. తెలంగాణ మూలాలు ఉన్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌గా, డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేశారు. సరితా కోమటిరెడ్డికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతు ఇస్తూ ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో రెండుసార్లు అటార్నీ జనరల్‌గా పనిచేసిన డెమొక్రటిక్‌ అభ్యర్థి లెటిటియాజేమ్స్‌కు సరిత గట్టి ప్రత్యర్థిగా మారారు. ఈ ఎన్నికలు నవంబరులో జరగనున్నాయి. ట్రంప్‌ తన ట్రంప్‌ తనకు మద్దతు తెలపడంపై ‘ఎక్స్‌’లో సరిత కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు చెందిన సరిత కుటుంబం దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లింది.

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 20 , 2026 | 06:38 AM