ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:39 AM
గాజులరామారం ఉషాముళ్ల పూడి సబ్‌స్టేషన్ పరిధిలోని 33/11కేవీ విద్యుత్ తీగల మర్మమతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏఈ చైతన్యభార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: గాజులరామారం ఉషాముళ్ల పూడి సబ్‌స్టేషన్ పరిధిలోని 33/11కేవీ విద్యుత్ తీగల మర్మమతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏఈ చైతన్యభార్గవ్(AE Chaitanya Bhargav) ఒక ప్రకటనలో తెలిపారు. రోడా మేస్త్రీనగర్, హజీ, అల్లీమసీదులైన్, ఎస్సీబీనగర్, వివేకానంద్‌నగర్, శ్రీనివాసనగర్, ఇందిరానగర్-ఏ, బీ, ఉషోదయాకాలనీ ఫేజ్-1, శ్రీరామ్‌నగర్, ఎంఎఫ్ ఫంక్షన్‌హాల్, ఉషోదయాకాలనీ మెయిన్‌రోడ్డు, బాలాజీ లే-అవుట్, శ్రీవెన్ ఎన్‌క్లేవ్ మెయిన్‌రోడ్డు, జహంగీర్‌బస్తీ, వీఎ్‌సఆర్‌అపార్టుమెంట్, గాజులరామారం మెయిన్ రోడ్డులో విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏఈ సోమవారం తెలిపారు.
ఆజామాబాద్ డివిజన్ పరిధిలో..
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నాగేశ్వరరావు(CBDADE Nageswara Rao) తెలిపారు. ఛేనెంబర్ ఏరియా, చిక్కడపల్లి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5వరకు, కృష్ణానగర్, నారాయణగూడ, గోల్నాక పరిధిలో మధ్యాహ్నం 3గంటల నుంచి 4వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?
Read Latest Telangana News and National News