Share News

బతుకమ్మ కుంటలో హైడ్రా బోర్డులు తొలగించాలి: హైకోర్టు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:18 AM

సివిల్‌ వివాదంలో ఉన్న బతుకమ్మ కుంట స్థలంలో చెరువును పునరుద్ధరించడంపై హైడ్రాను హైకోర్టు తప్పుబట్టింది. సివిల్‌ వివాదం కొనసాగుతుండగానే...

బతుకమ్మ కుంటలో హైడ్రా బోర్డులు తొలగించాలి: హైకోర్టు

సివిల్‌ వివాదంలో ఉన్న బతుకమ్మ కుంట స్థలంలో చెరువును పునరుద్ధరించడంపై హైడ్రాను హైకోర్టు తప్పుబట్టింది. సివిల్‌ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టడం సమంజసం కాదని తెలిపింది. అయితే ఇప్పటికే పనులు జరిగిన నేపథ్యంలో అక్కడ హైడ్రా ఏర్పాటు చేసిన సైన్‌ బోర్డు, అభివృద్ధి, టైటిల్‌కు సంబంధించిన బోర్డులు అన్నీ తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. స్థల వివాదం కొనసాగుతుండగా అక్కడ పనులు చేపట్టడంపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావుల ధర్మాసనం.. నాలుగువారాల్లో బోర్డులు తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Mar 24 , 2026 | 06:18 AM