Share News

జగన్‌కు మాట్లాడే దమ్ము లేదు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:18 AM

‘వైఎస్‌ సజీవ అర్ధభాగం.. విజయమ్మ రాసిన లేఖపై మాట్లాడే దమ్ములేని జగన్‌.. తన పార్టీ నేతలనాలో లేదా కుక్కలనాలో.. వారి తో మొరిగిస్తున్నాడు’ అని ఏపీసీసీ అధ్యక్షురా లు షర్మిల మండిపడ్డారు.

జగన్‌కు మాట్లాడే దమ్ము లేదు

  • కుక్కలతో మొరిగిస్తున్నాడు.. వివేక హత్యపై నిజాన్ని చెప్పా

  • అందుకే సైతాన్‌ సైన్యం దాడి: షర్మిల

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ సజీవ అర్ధభాగం.. విజయమ్మ రాసిన లేఖపై మాట్లాడే దమ్ములేని జగన్‌.. తన పార్టీ నేతలనాలో లేదా కుక్కలనాలో.. వారి తో మొరిగిస్తున్నాడు’ అని ఏపీసీసీ అధ్యక్షురా లు షర్మిల మండిపడ్డారు. విజయవాడలో సోమవారం ఆమె మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో తాను మాట్లాడుతూ.. సునీతపై అవినాశ్‌రెడ్డి చేసిన అసత్య ఆరోపణల ను ఖండించానని, అదే పెద్ద నేరమైందని అ న్నారు. తాను వివేకా హత్య గురించి మా ట్లాడుతుంటే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ‘‘వివేకా హత్యకు గురైన రోజు ఉదయం 7 గంటల నుంచి జగన్‌ మీడియాలో ‘గుండెపోటుతో చనిపోయారు’ అంటూ పదేపదే వార్త ప్రసారమైంది. ఆ సమయంలో అక్కడ ఉంది అవినాశ్‌రెడ్డి, జగన్‌ మీడియా ప్రతినిధులు. అప్పటికి సునీత హైదరాబాద్‌ నుంచి బయలుదేరనేలేదు. వాస్తవమిది కాగా, దీనికి భిన్నంగా అవినాశ్‌రెడ్డి.. ‘గుండెపోటు కథ సునీత అల్లిం ది’ అంటూ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నారు. నిజం తెలిసిన వ్యక్తిగా నేను దానిపై మాట్లాడాను. ఒక వేళ దీనిపై మాట్లాడాల్సి వస్తే అవినాశ్‌రెడ్డి లేకపోతే జగన్‌ మీడియాను నడుపుతున్న భారతి మాట్లాడాలి. వారికి దీనిపై మాట్లాడే ద మ్ములేక వైసీపీ నేతలతో ఆస్తుల గురిం చి మాట్లాడిస్తున్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా దానిని నిజం చేయవచ్చనుకుంటున్నారు. కాని సత్యా న్ని ఎప్పటికీ దాచలేరు. ఆస్తుల గురించి పదేపదే మాట్లాడుతున్నానని, జగన్‌ జైలుకు వెళ్లడానికి నేను కుట్ర చేశానని, చంద్రబాబుతో నేను, సునీత చేతులు కలిపామని డిల్యూజనల్‌గా.. ఏదేదో ఊహించుకొని.. మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాల్సిన అవసరం నాకు లేదు. వేరేవాళ్ల ఆస్తులను అనుభవిస్తున్నది జగన్‌, నేను కా దు. ఆస్తులే నా అజెండా అయితే నేను, జగ న్‌ సంతకాలు చేసిన ఎంఓయూని ఎప్పుడో బయటపెట్టేదాన్ని.


నా చేతిలోనే ఉన్న ఎంఓయూని నేను బయటపెట్టలేదు. ఆస్తి కోసం కోర్టుకూ ఎక్కలేదు. ఆస్తులు నా లక్ష్యం కాదు. సరస్వతి షేర్ల కోసం అమ్మపై కోర్టుకు వెళ్లిన జగన్‌.. ఆ ఎంవోయూని కోర్టులో సబ్మిట్‌ చేశా రు. ఆయన మూలంగానే అది ఇప్పుడు పబ్లి క్‌ డొమైన్‌లో ఉంది. ఆస్తులే ముఖ్యమనుకుంటే ఆంధ్రలో కా కుండా తెలంగాణలో పార్టీని స్థాపించేదాన్నేకాదు. వైఎస్‌ ఆశయాల కోసమే రాజకీయాల్లో ఉన్నాను. తన యావదాస్తి నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందాలన్న వైఎస్‌ ఆకాంక్షను విజయలక్ష్మి సంతకం చేసి లేఖ విడుదల చేశారు. ఆస్తుల పంపకంలో జగన్‌, తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చే శాడన్నారు. ఇక గ్లోబల్స్‌ ప్రచారం ఆపాలన్నా రు. కాని వైసీపీ వాళ్లు ఇంకా మాట్లాడుతున్నారంటే.. మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. లేఖ నిజం కాదని, ఆమెతో బలవంతం చేసి సంతకం చేయించానని సైతాన్‌ సైన్యం ప్రచారం చేస్తోందని విన్నాం. నిజంగానే సం తకం పెట్టకపోతే ఆమె బయటకు వచ్చి దా నిని చెప్పలేరా? లేకపోతే జగన్‌ ఫోన్‌ చేసి అడగలేరా? మీడియా ప్రతినిధిని పంపించి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా? నిజమేమిటో తెలుసు కాబట్టే జగన్‌ మాట్లాడడం లేదు. మాట్లాడే దమ్ములేదు.’ అన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 06:19 AM