ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ చార్జిషీట్
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:17 AM
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక అడుగు పడింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోమవారం కోర్టులో ...
ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్‌కుమార్..
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక అడుగు పడింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోమవారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) సంస్థను చేర్చారు. 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విదేశీ సంస్థ అయిన ఎఫ్‌ఈవోకు చట్ట విరుద్ధంగా రూ.54.88 కోట్లను మళ్లించారంటూ ఏసీబీ గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఆ నిధులు విడుదల చేసినట్టు.. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్‌కుమార్ ఏసీబీ విచారణలో వెల్లడించారు. తదుపరి దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ తాజాగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.