ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Feb 28 , 2026 | 06:48 AM
ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, అచ్చయ్యనగర్, బీఈ లేన్, చిక్కడపల్లి నాలా లేన్ ఏరియాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు.
హైదరాబాద్లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు(ADE Nageswara Rao) తెలిపారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, అచ్చయ్యనగర్, బీఈ లేన్, చిక్కడపల్లి నాలా లేన్, బర్కత్‌పుర రాఘవేంద్రస్వామి ఆలయం వీధి, కాచిగూడ కమేళా వెనుకభాగం తదితర ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1, సుందరయ్యవిజ్ఞానకేంద్రం పరిసర ప్రాంతాలు, చైతన్యకాలేజీ లేన్, బసంత్‌కాలనీ, వెంకటరమణ థియేటర్(Basant Colony, Venkataramana Theatre) ఏరియా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్
Read Latest Telangana News and National News