హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:40 AM
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతు పనుల కారణంగా శనివారం 11కేవీఈద్గా9 ఓల్డ్) పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జయనగర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, కలాడేరా నగర్ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు, విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.
గచ్చిబౌలి సబ్‌స్టేషన్ పరిధిలో..
రాయదుర్గం: గచ్చిబౌలి సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ చర్చ్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నానక్‌రామ్‌గూడ పరిధిలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ ఉండదని గచ్చిబౌలి సబ్‌స్టేషన్ ఏడీఈ శివకృష్ణ ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: దక్షిణ డిస్కం పరిధిలోని 132 కేవీ షాపూర్‌నగర్ నుంచి 132 కేవీ బొల్లారం వరకు ఉన్న విద్యుత్ లైన్ మార్చుతున్న నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో 8 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 132 కేవీ వరకు ఉన్న పాత కండక్టర్(తీగలు) స్థానంలో అధునాత హెచ్‌టీఎల్‌ఎ్‌స (హై టెంపరేచర్ లో సాగ్) కండక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పాంథర్ కండక్టర్ ద్వారా సుమారు 80 మెగావాట్ల విద్యుత్ లోడ్‌ను మాత్రమే సరఫరా చేసే సామర్థ్యం ఉండగా, హెచ్‌టీఎల్‌ఎస్ కండక్టర్ ఏర్పాటుతో ఈ సామర్థ్యం 150 మెగావాట్లకు పెరగనుందని అధికారులు పేర్కొన్నారు.
పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మియాపూర్ పరిధిలోని 11 కేవీ ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. మదీనాగూడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని లోటస్ కాలనీ, జేపీనగర్, నాగార్జున ఎన్‌క్లేవ్, అరబిందో కాలనీ, గ్రేటర్ ఇన్‌ఫ్రా, హెచ్‌ఎంటీ, స్వర్ణపురికాలనీ రోడ్ నంబరు 1 నుంచి 24 వరకు, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నెలకొంటాయని తెలిపారు. సమాచారం కోసం మియాపూర్ ఏఏఈ- 87124 72701, సీఎస్సీ ఏడీఈ ఆపరేషన్స్- 87124 72695లో సంప్రదించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!
కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News