హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Nov 05 , 2026 | 07:15 AM
హైదరాబాద్ నగరంలోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ పల్టాన్ ఫీడర్ పరిధిలోని అక్బర్‌బాగ్, ఆనంద్‌నగర్, దయానంద్ నగర్, నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి బీ బ్లాక్ వరకు పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు, గౌతం నగర్ ఫీడర్ పరిధిలోని భూలక్ష్మీనగర్, దిల్‌సుఖ్‌నగర్, గడ్డిఅన్నారం, ఎంసీ కాలనీ, సత్యనారాయణ స్వామి టెంపుల్, శాంతినగర్, స్ర్టీట్ లైట్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని డీఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు.. కిలో టమోటా రూ.29, పచ్చిబఠాణి రూ.135
Read Latest AP News And Telangana News And International News And Telugu News