విద్యావిధానంలో సంస్కరణలు తేవాలి!
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:51 AM
విద్యావిధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. పరీక్షల సంస్కరణలపై కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్..
సీఎం సూచన.. చంద్రబాబుతో నీలేకని కమిటీ భేటీ
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యావిధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. పరీక్షల సంస్కరణలపై కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్ నందన్ నిలేకని నేతృత్వంలోని బృందంతో ఆయన భేటీ అయ్యారు. బుధవారం సచివాలయానికి వచ్చిన కమిటీ సభ్యులకు మంత్రి లోకేశ్ ఆహ్వానం పలికారు. పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై వివిధ రాష్ర్టాల్లో పర్యటిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందం.. తాజాగా ఏపీకి వచ్చింది. ఏపీలో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ విధానాలను బృందం సభ్యులు ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా సంస్కరణలు తేవాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్