Share News

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:51 AM

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో లేడీడాన్‌ కోనేటి సులోచన సహా ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరో 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ నాగేశ్వరరావు చెప్పారు.

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌
కోనేటి సులోచన, శ్రీరాములునాయుడు

మదనపల్లె క్రైం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో లేడీడాన్‌ కోనేటి సులోచన సహా ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరో 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ నాగేశ్వరరావు చెప్పారు. వన్‌టౌన్‌ పోలీసులు కొన్ని రోజుల కిందట సులోచన, ఆమె కుటుంబ సభ్యులు శ్రీనాథ్‌, రెడ్డెమ్మ, అనుచరులు మోహన్‌, శ్రీరాములునాయుడిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో రెడ్డెమ్మ పరారీలో ఉండగా మిగతా నలుగురు జైలులో ఉన్నారు. ఇదిలావుండగా పట్టణానికి చెందిన మార్పూరి శ్రీరామ్‌ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు ఇటీవల సులోచనతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు సహా మొత్తం 12మందిపై ఫోర్జరీ, చీటింగ్‌, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో జైలులో ఉన్న సులోచన, కడియాల శ్రీరాములునాయుడు, గుండిగల మోహన్‌ను బుధవారం పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితు లను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ చెప్పారు. అలాగే పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:51 AM