నేతలు కట్టు తప్పడంపై టీపీసీసీ సీరియస్
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:19 AM
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సీరియ్‌సగా తీసుకున్నారు.
మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు పిలుపు
హైదరాబాద్, కామారెడ్డి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సీరియ్‌సగా తీసుకున్నారు. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన వారిని గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ వేదికగా దుర్భాషలాడుకున్న మంత్రి దామోదర, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును గాంధీభవన్‌కు రావాలని పిలిచారు.
గురువారం గాంధీభవన్‌లో వీరితో భేటీ కానున్నారు. పార్టీకి నష్టం వాటిల్లకుండా ఈ వివాదానికి త్వరితగతిన ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో మహేశ్‌గౌడ్ ఉన్నారు. అలాగే బిల్లులు, నిధులకు సంబంధించి ప్రభుత్వంపైనే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు వ్యంగ్యంగా లేఖ రాసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పిలిపించి వివరణ తీసుకోనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News