Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11 గంటలనుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:19 AM

హైదరాబాద్‏ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల దృష్ట్యా బుధవారం కరెంట్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11 గంటలనుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut

హైదరాబాద్‏: హైదరాబాద్‏ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల దృష్ట్యా బుధవారం కరెంట్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. కేఎంఐటి 11 కేవీ ఫీడర్‌ పరిధిలోని దీపక్‌ థియేటర్‌ లేన్‌, హరివిహార్‌ కాలనీ, కేశవ్‌ మెమోరియల్‌ స్కూల్‌, జీహెచ్‌ఎంసీ నారాయణగూడ మార్కెట్‌ ప్రాంతాల్లో ఉదయం 11 గంటలనుంచి 11.30 గంటలవరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని తెలిపారు.


రామంతాపూర్‌: రామంతాపూర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గణేష్‌ నగర్‌ ఫీడర్‌ నందలి శారదా నగర్‌, ఆనంద్‌ నగర్‌, పాత రామంతాపూర్‌ ప్రాంతాలలో ఈ నెల 18 న బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, కామాక్షీ పురం ఫీడర్‌లోని కామాక్షీ పురం, వాసవీ నగర్‌, రాంరెడ్డి నగర్‌ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ మేఘనాదం తెలిపారు.


చెంగిచర్ల పరిధిలో..

పీర్జాదిగూడ: నేడు చెంగిచర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు మేడిపల్లి ఏఈ హరినాథ్‌ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 33/11 కేవీ లైన్‌ పనులు (రోడ్డు వెడ ల్పు పనులు) కారణంగా ఈ క్రింది ఫీడర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది. 11 కేవీ వెంకటసాయినగర్‌ ఫీడర్‌ పరిధిలో శివగణేష్‌ నగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, అక్షయ నగర్‌, రాజేష్‌ నగర్‌, మహాగణపతి నగర్‌, ప్రతాప్‌ ఎన్‌క్లేవ్‌, దత్తాత్రేయ నగర్‌, నందిని నగర్‌, సాయి రెసిడెన్సీ, వెంకటాద్రి నగర్‌, ప్రివిలేజ్‌ కాలనీ, వెంకటసాయినగర్‌, కృష్ణా నగర్‌ ప్రాంత ప్రజలు సహకరించగలరని కోరారు.


city1.2.jpgబోడుప్పల్‌ పరిధిలో..

పీర్జాదిగూడ: నేడు బోడుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు బోడుప్పల్‌ ఏఈ వేణుగోపాల్‌ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోడుప్పల్‌ రోడ్డులో హెచ్‌ఎండీఏ పనుల కారణంగా 11 కేవీ లైన్‌ మార్పిడి పనులు 10 స్పాన్ల కొత్త లైన్‌ స్ట్రింగింగ్‌, పాతలైన్లు స్తంబాల తొలగింపు పనులు జరుగుతున్నందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది. 11 కేవీ ఇందిరానగర్‌ ఫీడర్‌ పరిధిలో సాయిరాం కాలనీ, శ్రీనివాస కాలనీ, బృందావన్‌ కాలనీ, అనంద్‌నగర్‌, ఎస్సీ బస్తీ, బొమ్మక బ్రదర్స్‌ కాలనీ, తూర్పు హనుమాన్‌ నగర్‌, పశ్చిమ హనుమాన్‌ నగర్‌, సన్నీ బేకరీ మెయిన్‌ రోడ్డు, సాయి భవానీ నగర్‌ కాలనీల ప్రజలు సహకరించాలని కోరారు.


సైదాబాద్‌: ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలోని మరమ్మతులు కారణంగా బుధవారం 11కేవీ తిరుమలహిల్స్‌ ఫీడర్‌ పరిధిలోని తిరుమల హిల్స్‌, రెవిన్యూ బోర్డు కాలనీ, గడ్డిఅన్నారం, నారాయణ కాలేజ్‌ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు

మావోయిస్టుల భారీ డంప్‌ల స్వాధీనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 07:19 AM