Share News

మావోయిస్టుల భారీ డంప్‌ల స్వాధీనం

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:50 AM

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవుల్లో సోమవారం మావోయిస్టు పార్టీకి చెందిన మూడు భారీ డంప్‌లను గుర్తించి, వాటిలో నుంచి 280 బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌ (బీజీఎల్‌) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు.

మావోయిస్టుల భారీ డంప్‌ల స్వాధీనం
Maoist Dumps Seized

  • పూజారి కాంకేర్‌ అడవుల్లో 280బీజీఎల్‌ షెల్స్‌ గుర్తింపు

చర్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవుల్లో సోమవారం మావోయిస్టు పార్టీకి చెందిన మూడు భారీ డంప్‌లను గుర్తించి, వాటిలో నుంచి 280 బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌ (బీజీఎల్‌) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. చర్ల పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో చర్ల సివిల్‌, స్పెషల్‌ పార్టీ, బీడీ టీం పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పూజారి కాంకేర్‌ అడవుల్లో కూంబింగ్‌ చేపట్టామని, ఇదే క్రమంలో భూమిలో పాతి పెట్టిన మూడు డంప్‌లను గుర్తించి, అందులో ఉన్న 280 బీజీఎల్‌ షెల్స్‌ బయటకు తీశామన్నారు.


2025లో పూజారి కాంకేర్‌ అడవిని సురక్షితంగా భావించి, భవిష్యత్‌ అవసరాల కోసం ఈ డంప్‌ని మావోయిస్టులు దాచి పెట్టారని, మావోయిస్టుల కదలికలు పెరిగితే ఈ డంప్‌ని వాడుకోవచ్చుననేది వారి ప్లాన్‌ అని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్‌ ముప్పాల లక్ష్మణ రావు అలియాస్‌ గణపతి, మరో ఇద్దరు సభ్యులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా లొంగిపోవాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:50 AM