Share News

దిశ మారిన ఆక్వాన్‌ తుపాన్‌

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:02 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా, ఆపై తుపానుగా మారడంతో ఈ నెల 20-22 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి.

దిశ మారిన ఆక్వాన్‌ తుపాన్‌
Cyclone Aqua

  • రాష్ట్రంలో వర్షానికి నో చాన్స్‌ !

  • చంపేస్తున్న చలి.. కోహిర్‌లో 11.3 డిగ్రీలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా, ఆపై తుపానుగా మారడంతో ఈ నెల 20-22 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్‌ తుపాన్‌ దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని మంగళవారం వెల్లడించింది. ఆక్వాన్‌ తుఫాన్‌ వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 20 నాటికి నెల్లూరు, విశాఖపట్నం మధ్య యానాం వద్ద అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


అయితే, గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. నాలుగు జిల్లాలు మినహా మిగిలిన అన్నిచోట్ల సోమవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపునకు చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 11.2, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 11.3, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణ్‌పల్లెలో 11.7, వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం తొర్రిమామిడిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 07:02 AM