Share News

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:04 AM

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut

సైదాబాద్‌(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలోని మరమ్మతుల కారణంగా గురువారం 11కేవీ హనుమాన్‌నగర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జమాల్‌ కాలనీ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు, శాలివాహననగర్‌ ఫీడర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.


city1.2.jpgచందానగర్‌: హుడా కాలనీ, శాంతినగర్‌, ఆర్టీసీ కాలనీలోని 33 కెవి విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ హుస్సేన్‌ తెలిపారు. హుడా కాలనీ, చర్చిరోడ్డు, జయ శంకర్‌పార్కు, శాంతినగర్‌, టింబర్‌ డిపో, గంగారం, చందానగర్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డు, సాయిబాబా దేవాలయం రోడ్డు హుడా కాలనీలతో పాటు పలు కాలనీలో విద్యుత్‌ ఉండదని ఏఈ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించండి

బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 07:04 AM