Share News

ఆస్ట్రేలియాకు తాండూరు కందులు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:11 AM

భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన తాండూరు కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అయ్యాయి.

ఆస్ట్రేలియాకు తాండూరు కందులు
Tandur Pigeon Peas

  • ‘అపెడా’ సహకారంతో 25 వేల క్వింటాళ్లు

  • జీఐ గుర్తింపు తర్వాత తొలిసారి ఎగుమతి

హైదరాబాద్‌/తాండూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన తాండూరు కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అయ్యాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్‌ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికారసంస్థ (అపెడా) సహకారంతో ఈ ఎగుమతికి మార్గం సుగమం అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ దుర్గా సంస్థ ‘అమ్మాస్‌’ బ్రాండ్‌ పేరుతో వీటిని ఎగుమతి చేస్తుండగా.. బుధవారం 25వేల క్వింటాళ్ల తాండూరు కందులు కలిగిన తొలి కంటెయినర్‌ హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది.


వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, అపెడా అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆర్‌పీ నాయుడు, హైదరాబాద్‌ ప్రాంతీయ అథారిటీ అదనపు విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్‌ జనరల్‌ సంపత్‌ కుమార్‌ వర్చువల్‌ విధానంలో ఈ సరుకు రవాణాను ప్రారంభించారు. సముద్రమార్గంలో వెళ్లే ఈ సరుకును ఆస్ట్రేలియాలోని ఎం ఎస్‌ భారతమ్మ పీటీవై లిమిటెడ్‌సంస్థ దిగుమతి చేసుకుంటుంది. అపెడాలో నమోదైన ఈ సంస్థ తెలంగాణ నుంచి బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, కిరాణాసరుకులను ఎగుమతి చేస్తుంది. తెలంగాణకే ప్రత్యేకమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రోత్సహించటంలో తాండూరు కందుల ఎగుమతిని తొలిమెట్టుగా భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:11 AM