Share News

వాకిలి వివాదం.. విషాదాంతం!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:38 AM

వాకిలి ఊడ్చే విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది.

వాకిలి వివాదం.. విషాదాంతం!
Kamareddy Crime news

  • ఊడ్చే విషయంలో పక్కింటి మహిళల మధ్య గొడవ

  • దుస్తులు ఉతికే బ్యాట్‌తో దాడి.. ఒకరి మృతి

గాంధారి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): వాకిలి ఊడ్చే విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్‌ తండాలో బుధవారం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో బస్సీ మదర్‌బాయి (50) మృతి చెందింది. తండాలో పక్కపక్క ఇళ్లలో నివసించే పూర్ణ, మదర్‌బాయి మధ్య వాకిలి ఊడ్చే విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి గొడవ తీవ్రం కావడంతో పూర్ణ దుస్తులు ఉతికే బ్యాట్‌తో మదర్‌బాయిపై దాడి చేసింది.


దీంతో తీవ్రంగా గాయపడిన మదర్‌బాయిని కుటుంబసభ్యులు వెంటనే గాంధారిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మదర్‌బాయి మృతితో ఆగ్రహించిన బంధువులు, తండావాసులు నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సదాశివనగర్‌ సీఐ వీరయ్య, గాంధారి ఎస్సై మహేందర్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు నిరసన విరమించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:38 AM