Share News

ఈ దేశం మోదీది.. ఆయన ఎక్కడికీ వెళ్లరు!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:47 AM

‘మోదీ బాప్‌ బీ జాయేగా’’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ ఓ గీతాన్ని విడుదల చేసింది

ఈ దేశం మోదీది.. ఆయన ఎక్కడికీ వెళ్లరు!
modi

  • సింహం, జనం మద్దతున్నవాళ్లు ఎప్పటికీ లొంగరు

  • ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ ప్రత్యేక గీతం విడుదల

ఢిల్లీ, అక్టోబరు 28: ‘‘మోదీ బాప్‌ బీ జాయేగా’’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ ఓ గీతాన్ని విడుదల చేసింది. ‘‘తల దించుకోండి.. చెవులు రిక్కించి వినండి.. ఈ దేశం మోదీది. మోదీ ఎక్కడికీ వెళ్లరు..’’ అంటూ ఈ గీతం సాగుతుంది. ఇటీవల పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతుండగా జనంలోంచి ఒకరు ‘మోదీ ఎక్కడికీ వెళ్లరు’ అని (మళ్లీ ఆయనే వస్తారు) అని బిగ్గరగా అరిచాడు. దీనికి స్పందనగా ఖర్గే ‘‘మోదీ బాప్‌ భీ జాయేగా’’ అంటూ పలుమార్లు వ్యాఖ్యానించడం వివాదాస్పమైంది. కాగా బీజేపీ విడుదల చేసిన గీతంలో ‘‘మీరు అనుకోవొచ్చు.. మోదీని లొంగదీస్తామని! సింహం ఎప్పటికీ లొంగదు. జనం మద్దతు ఉన్నవాళ్లు కూడా ఎప్పుడూ లొంగరు’’.. ’’మీరు నిందల మీద నిందలు వేసినా భారత ప్రజల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా మోదీ తన పనిని తాను చేసుకుంటూ వెళతారు’’ వంటి లైన్లు ఉన్నాయి.

Updated Date - Oct 29 , 2026 | 06:47 AM