Share News

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 07:56 AM

హైదరాబాద్ నగరంలోని వసంతనగర్‌ విద్యుత్‌ సెక్షన్‌ పరిధిలో 11కేవీ లైన్‌ ఏబీ స్విచ్‌ పనుల కోసం మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు
Hyderabad Power Cut Today

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని వసంతనగర్‌ విద్యుత్‌ సెక్షన్‌ పరిధిలో 11కేవీ లైన్‌ ఏబీ స్విచ్‌ పనుల కోసం మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఇంద్రసేనారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌, భగత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

పీర్జాదిగూడ: 33/11 కేవీ బీ,ఎల్‌ నగర్‌ సబ్‌స్టేషన్‌కు 11 కేవీలైన్‌కు టవర్లు ఏర్పాటు పనుల కారణంగా నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు బోడుప్పల్‌ ఏఈ వేణుగోపాల్‌ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫీడర్‌ 33/11కేవీ ఇందిరానగర్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి వచ్చే 11 కేవీ ఎస్‌బీఆర్‌ కాలనీ ఫీడర్‌, పరిధిలోని పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్‌ రెడ్డి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, బీ.ఎల్‌. నగర్‌, అంజయ్య ఎన్‌ క్లేవ్‌, టెలిఫోన్‌ కాలనీ ఫేజ్‌-2, పీఎన్‌ఆర్‌ కాలనీ,


city2.2.jpgరెడ్డిస్‌ కాలనీ, భవానీ కాలనీ, శుభోదయం కాలనీ, లెక్చరర్స్‌ కాలనీ, గ్రీన్‌ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ, భీమ్‌ రెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్‌ కాలనీ. ఉదయం 11 గంటల నుంచి 11:15 వరకు, మధ్యహ్నం 2:45 నుంచి 3 గంటల వరకు, 33/11కేవీ ఇందిరానగర్‌ సబ్‌ స్టేషన్‌ నుండి వచ్చే 11కేవీ వివేకానంద నగర్‌ ఫీడర్‌-జంపర్లు తొలగించి బ్యాక్‌ ఫీడింగ్‌ ఏర్పాటు చేయుటకు. అంతరాయం కలిగే ప్రాంతాలు మణికంఠ నగర్‌, వివేకానంద నగర్‌, శ్రీ లక్ష్మీ నగర్‌, లెక్చరర్స్‌ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీమ్‌ రెడ్డి కాలనీ, అశోక్‌ నగర్‌, గ్రీన్‌ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ వినియోగదారులు సహకరించగలరు.


చిల్కానగర్‌ పరిధిలో..

ఉప్పల్‌: విద్యుత్‌ లైన్లను టవర్లపైకి మార్చే పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు చిల్కానగర్‌ ఏఈ వినయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సూర్య హిల్స్‌, నార్త్‌ బాలాజీ హిల్స్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, హేమానగర్‌ ఫీడర్‌ పరిధిలోని సాయిభవాని నగర్‌, గాయత్రీ హిల్స్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, సహకరించాలని ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 07:56 AM