Share News

అమెరికన్‌ ఆర్థికవేత్తలకునోబెల్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:57 AM

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల అంశాలకే పరిమితం కాకుండా, కుటుంబాలు, వ్యాపార సంస్థలు తీసుకునే భవిష్యత్‌ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొనే కొత్త ఆర్థిక నమూనాలను ఈ ఇద్దరు ఆర్థిక వేత్తలు అభివృద్ధి చేశారు. కాగా, ఆర్థిక వృద్ధికి, మానవ సంక్షేమానికి సాంకేతిక పురోగతి, నూతన ఆవిష్కరణలు ఎలా దోహదపడతాయో తెలిపే పరిశోధనలకు గతేడాది ముగ్గురికి ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక నోబెల్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ప్రైజ్‌ ఇన్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌ పేరుతో పిలుస్తారు. ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ స్మారకంగా 1968లో ఆ కేంద్ర బ్యాంకు ఈ పురస్కారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ను కొందరు అసలైన నోబెల్‌ అవార్డుగా పరిగణించరు. అయినా మిగతా వాటితోనే డిసెంబరు 10న ఆర్థిక నోబెల్‌ను కూడా అందిస్తారు. గత వారంలో వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్‌ అవార్డులు ప్రకటించారు. ఆర్థికశాస్త్రంలో ప్రకటనతో నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు పూర్తయ్యాయి. ఈఏడాది ఒక్కో విభాగంలో బహుమతి సొమ్ము 12 మిలియన్ల క్రోనార్‌ (సుమారు రూ. 11.48 కోట్లు)లు విజేతలకు అందించనున్నారు.

అమెరికన్‌ ఆర్థికవేత్తలకునోబెల్‌

  • ఆర్థిక స్థిరీకరణ నమూనాలపై కృషికి నోబెల్‌

  • ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పురస్కారం

  • అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌లకు అవార్డు

స్టాక్‌హోమ్‌, అక్టోబరు 12: ఆర్థిక శాస్త్రంలో ఈఏడాది నోబెల్‌ పురస్కారం ఇద్దరికి దక్కింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు రాబర్ట్‌ ఈ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌లకు ఈ స్మారక అవార్డు లభించింది. స్థూల ఆర్థిక స్థిరీకరణకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సోమవారం ప్రకటించింది. హాల్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో, వుడ్‌ఫోర్డ్‌ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అవార్డు ప్రకటన సందర్భంగా ఆర్థికశాస్త్రంలో అవార్డు నిర్ణాయక కమిటీ చైర్మన్‌ జాన్‌ హ్యాస్లర్‌ మాట్లాడుతూ, ‘‘ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఇప్పుడు ఉపయోగిస్తున్న నమూనాలకు ఒక స్థిరమైన సైద్ధాంతిక పునాదికి ఈ పురస్కార గ్రహీతల కృషి కారణం. ఇంధన సంక్షోభం లేదా గృహ వినియోగాల్లో ఆకస్మిక మార్పులు వంటి ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కోవడానికి వారు చేసిన పరిశోధనల కారణంగా మనం మరింత మెరుగ్గా సన్నద్ధమవుతున్నాం’’ అని ప్రశంసించారు.

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల అంశాలకే పరిమితం కాకుండా, కుటుంబాలు, వ్యాపార సంస్థలు తీసుకునే భవిష్యత్‌ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొనే కొత్త ఆర్థిక నమూనాలను ఈ ఇద్దరు ఆర్థిక వేత్తలు అభివృద్ధి చేశారు. కాగా, ఆర్థిక వృద్ధికి, మానవ సంక్షేమానికి సాంకేతిక పురోగతి, నూతన ఆవిష్కరణలు ఎలా దోహదపడతాయో తెలిపే పరిశోధనలకు గతేడాది ముగ్గురికి ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక నోబెల్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ప్రైజ్‌ ఇన్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌ పేరుతో పిలుస్తారు. ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ స్మారకంగా 1968లో ఆ కేంద్ర బ్యాంకు ఈ పురస్కారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ను కొందరు అసలైన నోబెల్‌ అవార్డుగా పరిగణించరు. అయినా మిగతా వాటితోనే డిసెంబరు 10న ఆర్థిక నోబెల్‌ను కూడా అందిస్తారు. గత వారంలో వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్‌ అవార్డులు ప్రకటించారు. ఆర్థికశాస్త్రంలో ప్రకటనతో నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు పూర్తయ్యాయి. ఈఏడాది ఒక్కో విభాగంలో బహుమతి సొమ్ము 12 మిలియన్ల క్రోనార్‌ (సుమారు రూ. 11.48 కోట్లు)లు విజేతలకు అందించనున్నారు.

Updated Date - Oct 13 , 2026 | 06:57 AM