హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ఏరియాలివే..
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:03 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఎల్‌ఎన్‌నగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలోని అశోక్‌నగర్ నాలా, వారాసిగూడ, పుల్లయ్యబావి, అంబర్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం 11కేవీ సింగరేణికాలనీ, ఏకలవ్యనగర్ ఫీడర్ల పరిధిలో ఉదయం 11 నుంచి 12గంటల వరకు, బ్యాంకుకాలనీ పరిధిలోని పరిసరాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వర కు, చంచల్‌గూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12నుంచి 1.30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News