Share News

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాత పరీక్షలకు షెడ్యూలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:46 AM

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాత పరీక్షలకు షెడ్యూలు

  • డిసెంబరు 1 నుంచి 5 వరకు నిర్వహణ

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. 1న ఉదయం సివిల్‌ ఇంజనీరింగ్‌, ఇన్ర్సుమెంటేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఆర్జీయూకేటీ కెమిస్ర్టీ, ఆర్జీయూకేటీ ఐటీ, రూరల్‌ డెవల్‌పమెంట్‌, స్కల్ప్‌చర్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ సబ్జెక్టులు, మధ్యాహ్నం ఆంథ్రపాలజీ, బయోటెక్నాలజీ, ఈఈఈ, జియోలజీ, మేనేజ్‌మెంట్‌, నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌, ఆర్జీయూకేటీ ఫిజిక్స్‌, తెలుగు సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి. 2న ఉదయం కెమికల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, జాగ్రఫీ, పెయింటింగ్‌, ఫిలాసఫీ, ఆర్జీయూకేటీ తెలుగు, మధ్యాహ్నం... ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, ఈసీఈ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, జియోఫిజిక్స్‌, మెటలార్జికల్‌ ఇంజనీరింగ్‌, పాలీమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్జీయూకేటీ ఇంగ్లిష్‌ పరీక్షలు జరుగుతాయి.

3న ఉదయం బిల్డింగ్‌ టెక్నాలజీ, ఎకనమిక్స్‌, జియో ఇంజనీరింగ్‌, గణితం, నర్సింగ్‌, ఫార్మసీ, ఆర్జీయూకేటీ బయాలజీ, సంస్కృతం, సోషల్‌ వర్క్‌, మధ్యాహ్నం... బయోకెమిస్ర్టీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌, ఎడ్యుకేషన్‌, ఎలక్ర్టానిక్‌ సైన్స్‌, ఫిషరీ సైన్స్‌ అండ్‌ ఆక్వా కల్చర్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, ఆర్జీయూకేటీ ఫైన్‌ ఆర్ట్స్‌, యోగా పరీక్షలు నిర్వహిస్తారు. 4న ఉదయం కెమిస్ర్టీ, ఇంగ్లిష్‌, మెరైన్‌ బయాలజీ, ఎంసీజే, మైక్రోబయాలజీ, ఆర్జీయూకేటీ లైబ్రరీ సైన్స్‌, మ్యూజిక్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఉర్దూ, మధ్యాహ్నం.. ఆర్కిటెక్చర్‌, బయోసైన్సెస్‌, హిందీ, హిస్టరీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, మీటరాలజీ, ఫిజిక్స్‌, విజువల్‌/ఫైన్‌ ఆర్ట్స్‌, యోగా పరీక్షలు జరుగుతాయి. 5న బోటనీ, డిజైన్‌ టెక్నాలజీస్‌, హోమ్‌ సైన్స్‌, లా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ప్లానింగ్‌, సైకాలజీ, ఆర్జీయూకేటీ గణితం, సోషియాలజీ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:46 AM