‘జల్ జీవన్’ జోరు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:52 AM
జల్‌జీవన్ మిషన్ 2.0లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా నీటి సరఫరా, పారిశుధ్యమిషన్‌కు సాంకేతిక విభాగంగా డిస్ట్రిక్ట్ టెక్నికల్ యూనిట్(డీటీయూ) పనిచేయనుంది.
మిషన్ 2.0 అమలుకు జిల్లాకో సాంకేతిక విభాగం
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్ మిషన్ 2.0లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా నీటి సరఫరా, పారిశుధ్యమిషన్‌కు సాంకేతిక విభాగంగా డిస్ట్రిక్ట్ టెక్నికల్ యూనిట్(డీటీయూ) పనిచేయనుంది. జిల్లా కేంద్రంలో డీటీయూను ఏర్పాటుచేసి గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులు, నీటి నాణ్యత, ఆస్తుల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు. 15 రోజుల్లోగా డీటీయూలు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. డీటీయూకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖకు చెందిన డీఆర్‌వో లేదా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా గ్రామీణ నీటిసరఫరా పారిశుధ్య విభాగానికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థను నిర్వహించే గ్రామ పంచాయతీ/గ్రామ తాగునీటి సరఫరా పథకం, గ్రామం వెలుపల బల్క్ వాటర్ సరఫరా వ్యవస్థలను నిర్వహించే జడ్పీ మధ్య డీటీయూ సమన్వయం చేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం