Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాలో 11గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Aug 08 , 2026 | 09:54 AM

హైదరాబాద్ ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాలో 11గంటల నుంచి కరెంట్ కట్

చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమి త్తం శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్‌ తెలిపారు. ఇందిరానగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలోని తిలక్‌నగర్‌ మెయిన్‌రోడ్‌, కిషన్‌రావు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, డీడీ కాలనీ పరిధిలోని రామచంద్ర డిగ్రీ కాలేజీ, గ్లాస్కో, హిల్టన్‌ కేఫ్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంటవరకు విద్యుత్‌ సరఫరా ఉండదని, ఈ విషయంలో వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు.


zz.jpgపేట్‌బషీరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ నిలిపివేయబడు తుందని ఏఈ జ్ఞానేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 10.30 గంటల వరకు పైప్‌లైన్‌ ఫీడర్‌లో జీడిమెట్ల గ్రామం, ఎస్సీ కాలనీ, పైప్‌లైన్‌ రోడ్డు, ఎజెడ్‌, ఏఆర్‌ ఇన్‌ఫ్రా అపార్టుమెంట్స్‌, సీఎంఆర్‌ స్కూల్‌ ప్రాంతం, అంసబాద్‌ అపార్టుమెంట్స్‌, సాయిబాబా ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి 11.30గంటల వరకు సాయిబాబానగర్‌, ఎంఎన్‌రెడ్డినగర్‌ ఫేజ్‌-1,2, పద్మానగర్‌ ఫేజ్‌-2, వాజ్‌పేయ్‌నగర్‌, నాగులకుంట ప్రాంతంలో విద్యు త్‌ ఉండదని వినియోగదారులు గమణించి సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పరుగు ఆపని పసిడి.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ప్రతి ఠాణాలో సైబర్‌ వారియర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 09:54 AM