Share News

బేగంపేట క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Sep 15 , 2026 | 04:50 PM

హైదరాబాద్‌లోని బేగంపేటలో క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్యాసింజర్లుగా క్యాబ్ ఎక్కిన మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

బేగంపేట క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
police solved cab driver death case

హైదరాబాద్, సెప్టెంబర్ 14: నగరంలోని బేగంపేటలో క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. క్యాబ్‌ను దొంగలించడానికి ప్యాసింజర్లుగా ఎక్కిన దొంగల ముఠా.. అదును చూసి డ్రైవర్‌ను హత్య చేసినట్లుగా గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంపేటకు చెందిన రాజశేఖర్ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. అయితే, దొంగతనాలకు పాల్పడే మహారాష్ట్రకు చెందిన ఓ గ్యాంగ్ కన్ను రాజశేఖర్ క్యాబ్ మీద పడింది. ఎలాగైనా ఆ క్యాబ్‌ను చోరీ చేయాలని ఆ ముఠా ప్లాన్ చేసింది. ప్రణాళికలో భాగంగా క్యాబ్‌ను బుక్ చేసి.. ప్యాసింజర్లుగా అందులో ఎక్కారు.


పటాన్‌చెరు చేరుకోగానే.. కాసేపు డ్రైవ్ చేస్తామని చెప్పి రాజశేఖర్‌‌ను డ్రైవింగ్ సీటు నుంచి తప్పించి గ్యాంగ్‌లో ఒకరు డ్రైవ్ చేశారు. ఆ తర్వాత వెనుక సీటు నుంచి రాజశేఖర్ గొంతును వైరుతో బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా.. రాజశేఖర్ ముఖంపై దాడి చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రుద్రారం మార్గంలో రోడ్డుపక్కన పడేసి కారులో పరారయ్యారు. కాగా.. సీసీటీవీ ఫుటేజీ, క్యాబ్ బుకింగ్ ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు.. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 05:47 PM