Share News

హైదరాబాద్‌లో ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లు.. పంజా విసిరిన పోలీసులు

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:43 AM

లైసెన్సులు లేకుండా నడుపుతున్న కాస్మొటిక్స్, మెడికల్ స్టోర్లపై హైదరాబాద్ పోలీసులు పంజా విసిరారు. ఈ మేరకు నగరంలోని ముర్గీ మార్కెట్ సమీపంలోని పలు స్టోర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లు.. పంజా విసిరిన పోలీసులు
police raids in cosmetic stored in hyd

హైదరాబాద్, అక్టోబర్ 1: లైసెన్సులు లేకుండా నడుపుతున్న కాస్మొటిక్స్, మెడికల్ స్టోర్లపై హైదరాబాద్ పోలీసులు పంజా విసిరారు. డీసీపీ కె. ఎస్. రావు ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ బృందాలు, పోలీసులు పాల్గొన్నారు.


ముర్గీ మార్కెట్ సమీపంలోని పలు స్టోర్లలో తనిఖీలు నిర్వహించి లైసెన్సులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న వాటిని మూసివేశారు. పాకిస్థాన్, విదేశాల నుంచి అక్రమంగా తెప్పించిన స్కిన్ వైటెనింగ్ క్రీములను భారీగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యూటీ క్వీన్, బ్యూటీ లేడీస్ ఎంపోరియం, ఎస్‌జే మెడికల్ స్టోర్ల నుంచి భారీగా అక్రమ క్రీములు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రీములలో ప్రాణాంతక రసాయనాలు ఉంటాయని.. వీటిని వాడడం వల్ల చర్మ వ్యాధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పలు షాపు యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కామన్వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సత్తా

రెండో విడత ‘తల్లికి వందనం’ జాప్యమేల?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:15 AM