Share News

రెండో విడత ‘తల్లికి వందనం’ జాప్యమేల?

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:59 AM

తల్లికి వందనం మొదటి విడత నిధులు సకాలంలో విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత విడుదలను వాయిదాలు వేస్తోంది. జూలై 22న 64.76లక్షల మంది విద్యార్థులకు సంబంధించి నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

రెండో విడత ‘తల్లికి వందనం’ జాప్యమేల?

  • షెడ్యూలు ప్రకారం ఆగస్టు 30నే ఇవ్వాలి

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం మొదటి విడత నిధులు సకాలంలో విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత విడుదలను వాయిదాలు వేస్తోంది. జూలై 22న 64.76లక్షల మంది విద్యార్థులకు సంబంధించి నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఒకటో తరగతి అడ్మిషన్లు, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు, రికార్డులు సరిదిద్దాల్సినవి కలిపి మరో 2.7లక్షల మంది ఉంటారని అప్పట్లో ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ రెండో విడత ఆగస్టు 30న నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ షెడ్యూలు ప్రకారం నిధులు విడుదల కాలేదు. దీంతో సుమారు 3లక్షల మంది తల్లికి వందనం రెండో విడత నగదు కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ నిధులకు సంబంధించిన ఫైలుకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైలు పంపారు. అక్కడ ఆమోదం లభిస్తే త్వరలోనే నగదు విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రెండో విడత కూడా కలిపితే దాదాపు 68లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:59 AM