తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:22 AM
దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలను పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక
పంజాగుట్ట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలను పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ క్రమంలో పోలీ్‌సస్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సేవల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. సాంకేతిక ఏర్పాట్లు, పోలీస్ రికార్డులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు స్వీకరణ నుంచి దర్యాప్తు, ఛార్జిషీట్ రూపకల్పన వరకు పోలీసింగ్‌లోని ప్రతి దశలోనూ ఏఐ సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News