Share News

తాగునీటితో షాపు శుభ్రం..

ABN , Publish Date - May 28 , 2026 | 07:24 AM

తాగునీటితో దుకాణ పరిసరాలను శుభ్రం చేస్తున్న యజమానికి వాటర్‌బోర్డు రూ.10వేలు జరిమానా విధించింది.

తాగునీటితో షాపు శుభ్రం..
Hyderabad Drinking Water

  • రూ.10వేల జరిమానా

హైదరాబాద్‌ సిటీ: తాగునీటితో దుకాణ పరిసరాలను శుభ్రం చేస్తున్న యజమానికి వాటర్‌బోర్డు రూ.10వేలు జరిమానా విధించింది. ఇటీవల బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో వెళ్తున్న జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ రెడ్డికి ఆరెంజ్‌ ట్రీ ఫర్నిచర్‌ దుకాణానికి సంబంధించిన ఓ వ్యక్తి తాగునీటితో ప్రాంగణాన్ని కడుగుతూ కనిపించాడు. దీంతో ఎండీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి నోటీసు అందించి జరిమానా వెయ్యాలని సంబంధిత సెక్షన్‌ మేనేజర్‌ను ఎండీ ఆదేశించారు. ఈ మేరకు ఆ వ్యక్తికి రూ.పదివేలు జరిమానా విధించారు.

city1.jpg


సరఫరాలో ఇబ్బందులు రావద్దు

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో నగరవాసులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జేఎండీ మయాంక్‌ మిట్టల్‌తో కలిసి ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు.


ట్యాంకర్‌ బుకింగ్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలకు అంతరాయం

ఎస్‌డీసీ లింక్‌ అంతరాయం కారణంగా జలమండలి పరిధిలో ట్యాంకర్‌ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ సేవలు తాత్కాలికంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్‌ బుకింగ్‌ల కోసం ఐవీఆర్‌ఎస్‌ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 07:24 AM