Share News

గాల్లోకి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌

ABN , Publish Date - May 28 , 2026 | 05:27 AM

విజయవాడకు చెందిన ‘రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌’ స్టార్టప్‌ స్వదేశీయంగా రూపొందించిన తొలి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ ‘విస్టా’..

గాల్లోకి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌

  • రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ సంస్థ ప్రయోగం విజయవంతం

  • ఇదొక చరిత్రాత్మక ఘట్టం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విజయవాడ, మే 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన ‘రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌’ స్టార్టప్‌ స్వదేశీయంగా రూపొందించిన తొలి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ ‘విస్టా’ (వీఐఎస్‌టీఏ)ను ప్రయోగం విజయవంతమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ ప్రయోగంలో భాగంగా ఈ బెలూన్‌ దేశ, విదేశాలకు చెందిన ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. ఈ బెలూన్‌ భూమి నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులోని నియర్‌ స్పేస్‌ (స్ట్రాటో ఆవరణం) వరకు చేరుకుంటుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికత రైతులు, సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పంటల స్థితిగతులు, భూమి సామర్థ్యం, ల్యాండ్‌ సర్వేలు, అటవీ విస్తీర్ణం వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి అగ్ర దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు భారత్‌కూ సొంతమైంది. బుధవారం ప్రయోగించిన బెలూన్‌ 24 గంటలపాటు గాలిలో ఉంటుందని అంచనా. నెలల తరబడి గాలిలో నిలవగల సూపర్‌ ప్రెజర్‌ బెలూన్ల అభివృద్ధే లక్ష్యంగా రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ పనిచేస్తోంది. అంతరిక్షంలో ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయో ఈ బెలూన్లూ అలాగే పనిచేస్తాయి. ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి చౌకైనవి.

Updated Date - May 28 , 2026 | 05:27 AM