Share News

మెట్రో ఆదాయంలో 2వ స్థానంలో హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:21 AM

మెట్రో రైలు ఆదాయంలో హైదరాబాద్‌.. బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెల్లడైన గణాంకాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నెట్‌వర్క్‌లు కలిపి రూ.3,203 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.

మెట్రో ఆదాయంలో 2వ స్థానంలో హైదరాబాద్‌
Hyderabad Metro

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు ఆదాయంలో హైదరాబాద్‌.. బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెల్లడైన గణాంకాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నెట్‌వర్క్‌లు కలిపి రూ.3,203 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇందులో రూ.1,191 కోట్లతో బెంగళూరు మెట్రో మొదటి స్థానంలో నిలవగా.. రూ.1,113 కోట్లతో హైదరాబాద్‌ మెట్రో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ రెండు మెట్రోల ఆదాయాల మధ్య వ్యత్యాసం రూ.78 కోట్లు మాత్రమే కావడం విశేషం. దక్షిణాది మెట్రో ఆదాయంలో హైదరాబాద్‌ వాటా 34.7 శాతంగా ఉంది.


నగరంలో పెరుగుతున్న ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల అవసరాలు మెట్రో సేవలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఐటీ కారిడార్లు, ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, నివాస ప్రాంతాలను అనుసంధానించే మెట్రో మార్గాలు నగర ప్రజలకు కీలక రవాణా సాధనంగా మారాయి. ఆదాయాల పరంగా చెన్నై మెట్రో రూ.624 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. కేరళలోని కొచ్చి మెట్రో రూ.275 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నాలుగు నగరాల మొత్తం ఆదాయంలో బెంగళూరు, హైదరాబాద్‌ మెట్రోల వాటానే 72 శాతంగా ఉంది. ఈ రెండు నగరాల మెట్రో వ్యవస్థలు కలిపి రూ.2,304 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. మెట్రో విస్తరణ, ప్రయాణికుల సంఖ్య పెరుగుదలతో హైదరాబాద్‌ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:21 AM