Share News

30న మారథాన్‌.. సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:54 AM

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నిర్వహించనున్న 14వ ఎడిషన్‌ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌-2026 సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

30న మారథాన్‌.. సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad traffic restrictions August 30

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నిర్వహించనున్న 14వ ఎడిషన్‌ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌-2026 సందర్భంగా ఉదయం 4 నుంచి 11.30 గంటల వరకు సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని జాయింట్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే మారథాన్‌లు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45, కేబుల్‌ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్‌, మైహోమ్‌ అబ్రా, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, ఇంద్రానగర్‌, ఐఐఐటీ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటాయి. హైటెక్స్‌ నుంచి ప్రారంభమయ్యే 10కే రన్‌ ఎన్‌ఏసీ, సీఐఐ జంక్షన్‌, గాటి, రెయిన్‌బో హాస్పిటల్‌, డెల్‌ జంక్షన్‌, ఐకియా అండర్‌పాస్‌, బయోడైవర్సిటీ, టెలికాం నగర్‌ మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుతుంది.


వాహనాల దారి మళ్లింపు ఇలా..

  • షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌/దర్గా నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను నానక్‌రామ్‌గూడ రోటరీ-విప్రో సర్కిల్‌-గౌలిదొడ్డి-గోపన్‌పల్లి మీదుగా నల్లగండ్ల-లింగంపల్లికి మళ్లిస్తారు.

  • లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే వాహనాలను హెరిటేజ్‌ జంక్షన్‌, బొటానికల్‌ గార్డెన్‌, అంజయ్యనగర్‌, రాడిసన్‌, పీజేఆర్‌ ఫ్లైఓవర్‌, ఓఆర్‌ఆర్‌, నానక్‌రామ్‌గూడ మీదుగా మళ్లిస్తారు.


  • కూకట్‌పల్లి/కొండాపూర్‌ వైపు వెళ్లే వాహనాలను ఐకియా రోటరీ-మీనాక్షి జంక్షన్‌-రోలింగ్‌ హిల్స్‌-పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ కింద యూటర్న్‌ మీదుగా మళ్లిస్తారు.

  • ఓఆర్‌ఆర్‌ వైపు వెళ్లే వాహనాలను ఐకియా కొత్త యూటర్న్‌, ఆర్బిట్రేషన్‌ రోడ్‌, శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌కు పంపిస్తారు.

  • ఐకియా నుంచి బయోడైవర్సిటీ మీదుగా మెహిదీపట్నం వెళ్లే వాహనాలను ఐఓసీఎల్‌ టీ జంక్షన్‌-టీ వర్క్స్‌, మైహోమ్‌ భూజా-ఓల్డ్‌ ముంబై హైవే-ఖాజాగూడ మీదుగా మళ్లించనున్నారు.


city6.2.jpg

  • కొండాపూర్‌ నుంచి సైబర్‌ టవర్స్‌ వైపు వచ్చే వాహనాలను అంజయ్యనగర్‌-రాడిసన్‌-రోలింగ్‌ హిల్స్‌- ఏఐజీ-ఐకియా ఫ్లైఓవర్‌-ఇనార్బిట్‌ మాల్‌-దుర్గం చెరువు-సీఓడీ మీదుగా మళ్లిస్తారు.

  • మియాపూర్‌ ఆల్విన్‌ జంక్షన్‌ నుంచి సైబర్‌ టవర్స్‌ వైపు వచ్చే వాహనాలను వసంత సిటీ కాలనీ-ఎన్‌ఏసీ వెనుక రోడ్డు-హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్-ఎన్‌ఐఏ రోడ్‌ మీదుగా మళ్లిస్తారు.


  • భారతి విద్యాభవన్‌ అండర్‌ బ్రిడ్జి నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే వాహనాలను కావూరి హిల్స్‌, దివ్య డైమండ్స్‌, నెక్టర్‌ గార్డెన్‌-దుర్గం చెరువు-ల్యాబ్స్‌-ఐటీసీ కోహినూర్‌-ఆర్‌ఎంజెడ్‌-క్వాల్‌కామ్‌-మైహోమ్‌ భూజా-ఓల్డ్‌ ముంబై హైవే మీదుగా మళ్లిస్తారు.

  • ఐఐఐటీ జంక్షన్‌ మీదుగా విప్రో వైపు వెళ్లే వాహనాలను ఇంద్రానగర్‌ టీ జంక్షన్‌-జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌-గోపీచంద్‌ అకాడమీ-ఇన్ఫోసిస్‌ మీదుగా విప్రో జంక్షన్‌కు పంపిస్తారు.

  • ఐఐఐటీ వైపు వచ్చే వాహనాలను ఫెయిర్‌ఫీల్డ్‌ హోటల్‌-నానక్‌రామ్‌గూడ రోటరీ-ఓఆర్‌ఆర్‌ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు మళ్లిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!

అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 10:54 AM