Share News

హైదరాబాద్‏లో.. చెరువుల అభివృద్ధికి రూ.227 కోట్లు

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:09 AM

హైదరాబాద్‌ నగర పరిధిలో( ఓఆర్‌ఆర్‌ లోపల) నాలుగు చెరువుల అభివృద్ధికి తొలి దశ కింద రూ.227.98 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది.

హైదరాబాద్‏లో.. చెరువుల అభివృద్ధికి రూ.227 కోట్లు
Hyderabad lake development

  • హైడ్రాకు రూ.12.50 కోట్లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పరిధిలో( ఓఆర్‌ఆర్‌ లోపల) నాలుగు చెరువుల అభివృద్ధికి తొలి దశ కింద రూ.227.98 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది. చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.74.35 కోట్లతో జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, రూ.68 కోట్లతో అమీన్‌పూర్‌ చెరువు, రూ.35 కోట్లతో అంబర్‌ చెరువు(భాగ్‌మీర్‌), రూ.50.63 కోట్లతో సరూర్‌నగర్‌ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.


city4.2.jpgమూడు దశల్లో ఈ నాలుగు చెరువుల పనులు చేపట్టనున్నారు. నాలుగు చెరువుల అభివృద్ధికి రూ.536 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో దశలో రూ.147.46 కోట్లు, మూడో దశలో సుందరీకరణ పనులకు రూ.161.06 కోట్లు వెచ్చించనున్నారు. ఈ పనులను హైడ్రా ద్వారా చేపట్టనున్నట్లు తెలిపింది. మరో ఉత్తర్వులో ప్రభుత్వం హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

కొత్త రిజిస్ట్రార్‌ ఎక్కడ?

నష్టాలతో ప్రారంభమైన సూచీలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 10:09 AM