Share News

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తాబా చనిపోయారా?

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:42 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తాబా చనిపోయారా?
Mojtaba Khamenei

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు. సోమవారం ఫాక్స్ న్యూస్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లకు నేవీ లేదు. ఎయిర్‌ఫోర్స్ లేదు. అంతా నాశనం అయింది. వాళ్ల యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ కూడా ధ్వంసం అయింది. వాళ్ల నాయకులు చనిపోయారు. ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. అతడి కుమారుడు మొజ్తాబా కూడా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉంది’ అని అన్నారు.


ఐదు నెలలుగా కనిపించని మొజ్తాబా..

గత ఫిబ్రవరి నెలలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కోడలు, మనవరాలు చనిపోయారు. ఆ రోజు నుంచి మొజ్తాబా ఖమేనీ కనిపించటం లేదు. గత వారం జరిగిన తండ్రి అంత్యక్రియల్లో కూడా ఆయన పాల్గొనలేదు. మొజ్తాబా చనిపోయాడన్న వార్తలను ఇరాన్ కీలక నేతలు ఖండిస్తున్నారు తప్ప.. మొజ్తాబా మాత్రం బయటకు రావటం లేదు.


ఇవి కూడా చదవండి

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి

Updated Date - Jul 14 , 2026 | 09:51 AM