Share News

ట్రైన్‌లో దుప్పట్లు, టవల్స్‌ ఎత్తుకుపోతున్నారు!

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:23 AM

భారతీయ రైల్వే ఏసీబోగీలోని ప్రయాణికులు చేతివాటం చూపిస్తున్నారు. రైలుకు సంబంధించిన దుప్పట్లు, టవల్స్‌ను...

ట్రైన్‌లో దుప్పట్లు, టవల్స్‌ ఎత్తుకుపోతున్నారు!

నాలుగేళ్లలో అలా చోరీకి గురైన వాటి విలువ రూ.104 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 13: భారతీయ రైల్వే ఏసీబోగీలోని ప్రయాణికులు చేతివాటం చూపిస్తున్నారు. రైలుకు సంబంధించిన దుప్పట్లు, టవల్స్‌ను చోరీ చేస్తున్నారు. ఏసీ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే బెడ్‌రోల్‌ కిట్‌ను ఇస్తుంది. ఇందులో దుప్పట్లు, టవల్స్‌ లాంటివి ఉంటాయి. అయితే గమ్యం చేరాక ప్రయాణికులు వీటిని బోగీలోనే వదలకుండా తమ వెంటే తీసుకుపోతున్నారు. ఈ చోరీల వల్ల నాలుగేళ్లలో సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తులో ఈ సమాచారం వెల్లడయింది. కాగా ఇంతవరకు 46 లక్షల టవళ్లను ప్రయాణికులు అపహరించారు. అలాగే 40 లక్షల దాకా బెడ్‌షీట్లను చోరీ చేశారు. 20 లక్షలకుపైగా పిల్లో కవర్లను తీసుకుపోయారు. అత్యధికంగా 25.76 లక్షల బెడ్‌రోల్‌ వస్తువుల చోరీలతో రాజస్థాన్‌లోని బికనేర్‌ డివిజన్‌ మొదటి స్థానంలో ఉంది. రాంచీ, ఢిల్లీ, ముంబై, జోద్‌పూర్‌, అహ్మదాబాద్‌ డివిజన్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 06:23 AM