హైదరాబాద్‌లో భారీ గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:29 AM
హైదరాబాద్ మురాద్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గుట్కా తయారీ కేంద్రంపై అసిఫ్‌నగర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రూ.50 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 3: నగరంలోని అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో గుట్కాను తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అసిఫ్‌నగర్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా పాల్గొన్నారు.
గుట్కా తయారీ కేంద్రంలో AAA, బాద్‌షా, సాగర్ బ్రాండ్ల గుట్కాలను అధిక మొత్తంలో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం.. రూ.50 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా.. గుట్కా తయారీ కేంద్రం కీలక నిర్వాహకులైన జుబేర్, ముజఫ్ఫర్ తప్పించుకున్నట్లు వారు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ దాండా
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్