44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:09 PM
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తుదిపోరులో చైనాను 1-0తేడాతో ఓడించడంతో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.
మ్యాచ్ ప్రారంభంలో భారత్ తరఫున లాల్‌రెమ్ సియామి గోల్ చేసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడి నుంచి తమ పట్టును నిలుపుకుంటూనే.. ప్రత్యర్థి జట్టుకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. చివరకు పోరాడిన ప్రత్యర్థి చైనా జట్టుకు నిరాశే మిగిలింది. హాకీ విభాగంలో టీమిండియా చివరగా... స్వదేశంలో 1982 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. దాదాపు 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత తాజాగా మరోసారి పసిడిని అందుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతలో మొత్తంగా 76 పతకాలు ఉన్నాయి. మరోవైపు తాజా విజయంతో ఒలింపిక్స్ 2028కు భారత మహిళా హాకీ జట్టు నేరుగా అర్హత సాధించింది.
ఇవి కూడా చదవండి:
రెడ్ బాల్ క్రికెట్‌కు చాహల్ గుడ్‌బై.. ఫస్ట్ క్లాస్ ఆటకు స్వస్తి!
ఆసియా క్రీడలు 2026: భారత్‌కు పర్వీన్ హూడా పసిడి కానుక!