Share News

విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:33 PM

విశాఖ సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరానికి సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
Madhurawada Beach Tragedy

విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలో ఇవాళ (శుక్రవారం) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరానికి సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గాంధీ జయంతి సెలవు రోజు కావడంతో మధురవాడ ఐటీ సెజ్‌ తీరానికి ఆరుగురు విద్యార్థులు చేరుకున్నారు. సముద్రంలో సరదాగా ఈత కొట్టేందుకు ముగ్గురు లోపలికి వెళ్లారు. అయితే, అలల తాకిడికి ఆ ముగ్గురూ గల్లంతయ్యారు.


గల్లంతైన వారిని సూర్యప్రకాశ్, నితీశ్‌, ప్రశాంత్‌ (14)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖభ్రత బాగ్చి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పిల్లల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏపీ విద్యార్థులకు చోటు.. మంత్రి లోకేశ్ హర్షం..

70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలు

Updated Date - Oct 02 , 2026 | 05:36 PM