ఆసియా క్రీడలు 2026: భారత్‌కు పర్వీన్ హూడా పసిడి కానుక!
ABN , Publish Date - Oct 02 , 2026 | 03:19 PM
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ల పసిడి పరంపర కొనసాగుతోంది. మహిళల బాక్సింగ్‌లో స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణం సాధించి.. సంబరాల్లో ఉండగానే మరో స్టార్ బాక్సర్ పర్వీన్ హూడా భారత ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ల పసిడి పరంపర కొనసాగుతోంది. మహిళల బాక్సింగ్‌లో స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణం సాధించిన సంబరాల్లో ఉండగానే మరో స్టార్ బాక్సర్ పర్వీన్ హూడా భారత ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చింది. మహిళల 65 కేజీల బాక్సింగ్ విభాగం ఫైనల్లో పర్వీన్ అద్భుత ప్రదర్శనతో మెరిసి భారత్‌కు 13వ బంగారు పతకాన్ని అందించింది.
ఉత్కంఠభరిత పోరులో విజయం
చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్‌తో తుదిపోరు అత్యంత రసవత్తరంగా సాగింది. ప్రారంభం నుంచే ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి రౌండ్‌లో చెన్ దూకుడుగా ఆడుతూ కొన్నిబలమైన పంచ్‌లు విసిరి ఆధిపత్యం ప్రదర్శించే యత్నం చేసింది. అయితే పర్వీన్ కూడా తగ్గేదేలే అన్నట్లు ప్రత్యర్థిపై బలమైన పంచులతో ప్రతిఘటించింది. చివరి రౌండ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పర్వీన్ తన రింగ్ వ్యూహాలతో, తనదైన ఆటతో ఆకట్టుకుంది.
ఆఖరి నిమిషం వరకు ఉత్సాహంగా పోరాడి 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో హూడా విజేతగా నిలిచింది. పర్వీన్ సాధించిన స్వర్ణం భారత్‌కు 13వది. మరోవైపు పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ అంకుశ్ పంఘల్ కూడా స్వర్ణం సాధించాడు. ఫైనల్‌లో 4-0 తేడాతో తన ప్రత్యర్థి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సూయింగ్‌పై విజయం సాధించాడు.
రెజ్లింగ్‌లో సూపర్ పట్టు..
భారత రెజ్లర్ సుజీత్ సూపర్ పట్టుతో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఆరంభంలో ఒలింపిక్ ఛాంపియన్, తజకిస్థాన్‌కు చెందిన కుదీవ్ పైచేయి సాధించాడు. ఆ తర్వాత సుజీత్ పుంజుకొని.. తజికిస్థాన్ రెజ్లర్‌ను దెబ్బ కొట్టాడు. చివరికి 10-9 తేడాతో సుజీత్ పైచేయి సాధించి బంగారు పతకాన్ని గెలిచాడు. మొత్తంగా ఇవాళ(శుక్రవారం)ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు గోల్డ్ మెడల్స్ చేరాయి.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్ ప్లేయర్‌పై కాసుల వర్షం... కోట్లు ఖర్చు చేసిన ముంబై!
శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది: హర్భజన్ సింగ్